KKD: పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దుండగులు చించివేశారని జనసేన నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షలకు పాల్పడటం సరికాదని, ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.