ELR: జిల్లాలో జనవరి 19 నుంచి 31 వరకు ఉచిత పశువైద్య శిబిరాలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ సోమవారం గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పశువులను పరిశీలించి అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తాం అన్నారు. జిల్లాలోని ప్రతీ పాడిరైతు ప్రయోజనం పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు.