NZB: ఈ నెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, 22న 2వ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) తిరుమలపూడి రవికుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు కచ్చితంగా చేరుకోవాలని, ప్రతి విద్యార్థి తప్పని సరిగా హాజరుకావాలన్నారు.