VKB: వికారాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రహిత రుణాలు అందజేశారు. అదనపు కలెక్టర్ సుదీర్ మాట్లాడుతూ.. ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహం కల్పిస్తోందని, రుణాలు సమర్థవంతంగా ఉపయోగిస్తే సామాజిక, ఆర్థిక స్వావలంబనకు సహాయపడుతాయని గుర్తు చేశారు.