దేశవ్యాప్తంగా NITల్లో బీటెక్ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత పొందేందుకు రేపటి నుంచి జేఈఈ మెయిన్స్-2026 ప్రారంభం కానుంది. ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 14.50 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు సమచారం. దీంతో జాతీయ పరీక్షల సంస్థ ఏపీలో 8, తెలంగాణలో 3 పరీక్ష కేంద్రాలను పెంచింది. రెండు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరుకానున్నారని అంచనా.