ధరల పెరుగదలలో వెండి దూకుడుగా వెళ్తోంది. ఇది కొనుగోలుదార్లకు ఆందోళన కలిగిస్తుండగా.. పెట్టుబడిదార్లను మాత్రం ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ నెలలోనే వెండి కిలో ధర రూ. 2.40 లక్షల నుంచి రూ. 3.09లక్షలకు పైగా పెరిగింది. దీపావళి సమయంలో ధర బాగా పెరిగినా.. పండగ తర్వాత 2025 అక్టోబరు 27న కిలో వెండి ధర రూ.1.48 లక్షలకు దిగి వచ్చింది.