NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేసిందని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.