NZB: సాలుర మండలం సాలాంపాడ్ గ్రామంలో నేడు బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ సాలూర మండల అధ్యక్షుడు మంధర్నా రవి సోమవారం తెలిపారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రేపు 11 గంటలకు ఆయన ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి సాలుర, బోధన్ మండలాల కాంగ్రెస్ నాయకులు, పాల్గొనాలన్నారు.