KNR: ఐదు రోజుల విరామం అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ఇవాళ ప్రారంభమైంది. పత్తి ధరలు ఆశాజనకంగా నమోదై గరిష్ఠంగా క్వింటాల్‌కు రూ.8 వేల వరకు పలికాయని పలువురు రైతులు తెలిపారు. మార్కెట్లో 14 వాహనాల ద్వారా మొత్తం 102 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. గత కొన్ని రోజులతో పోల్చితే ధరలు పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.