E.G: రాజానగరం మండలం రామస్వామిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మానం వీరబాబు (47) దుర్మరణం పాలయ్యారు. అనపర్తిలో డ్యూటీ ముగించుకుని అర్ధరాత్రి రంగంపేట పోలీస్ స్టేషన్కు వస్తుండగా.. గూడ్స్ ఆటో వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మరణించడంతో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది.