ప్రకాశం: గిద్దలూరు మండలం లోని మిట్టమీదిపల్లి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పాడి పశువుల పోషణపై అవగాహన కల్పించడంతో పాటు, దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. అలాగే ఎదకురాని పశువులకు చికిత్స చేసి అవసరమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్. బాలు నాయక్ పాల్గొన్నారు.