»Samajavaragamana Will Shri Vishnu Give A Hit This Time
Samajavaragamana Movie: ‘సామజవరగమన’ సెన్సార్ టాక్.. శ్రీ విష్ణు ఈసారైనా హిట్ కొట్టేనా?
కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. లాస్ట్ ఇయర్ భళాతందనాన, అల్లూరి సినిమాలతో ఆకట్టుకోలేకపోయిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు సామజవరగమన అనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఆడియెన్స్‌కు ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ హీరో స్థాయికి ఎదిగాడు శ్రీ విష్ణు(Sri Vishnu). మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి సినిమాల ద్వారా మంచి సక్సెస్‌తో పాటు గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా సినిమాలు చేసే శ్రీ విష్ణు.. ఈ మధ్య కాలంలో యాక్షన్ బాట పట్టాడు. ఈ క్రమంలో వచ్చిన అల్లూరి సినిమాతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అందుకే మరోసారి ‘సామజవరగమన'(Samajavaragamana Movie) అనే ఫ్యామిలీ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది.
ఈ చిత్రాన్ని వివాహ భోజనంబు ఫేం రామ్ అబ్బ రాజు దర్శకత్వం వహించాడు. జూన్ 29వ తేదీన సామజవరగమన థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ మెంబర్స్ సామజవరగమన(Samajavaragamana Movie)కు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే.. ఈ సినిమాను ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా చూసెయెచ్చు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. శ్రీ విష్ణు ప్రేమించిన అమ్మాయితోనే రాఖీ ఎందుకు కట్టించుకున్నాడు అనే.. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో చేసిన ప్రమోషనల్ కంటెంట్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. మరి ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో అయినా శ్రీ విష్ణు(Sri Vishnu) మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.