TPT: నాయుడుపేట పట్టణం 14వ వార్డులో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కౌన్సిలర్, వైసీపీ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ షబ్బీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. సుమారు 250 మంది మహిళలకు చీరలు, 30 మంది పురుషులకు లుంగీలు, షర్ట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ జిలానీబి, షేక్ నజర్, షేక్ అబ్బాస్ పాల్గోన్నారు.