»A Female Maharashtra Mla Slapped An Engineer On The Cheek Viral Video
Viral Video: ఇంజనీర్ చెంపపై కొట్టిన మహిళా ఎమ్మెల్యే
మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ యువ ఇంజనీర్ చెంపచెల్లుమనిపించారు. మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ ఇద్దరు ఇంజనీర్లను విచారించి, వారిలో ఒకరిని కొట్టగా..ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి.
మహారాష్ట్ర(maharashtra)థానేకు చెందిన మీరా భైందర్ పూర్ణిగమ్కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు ఇటీవల పూర్ ప్రాంతంలోని కొన్ని ఇళ్లను కూల్చివేశారని స్థానికులు ఆరోపించారు. ‘అక్రమ నిర్మాణాల’ కోసం కూల్చివేసిన ఇళ్లలో ప్రధానంగా పేద ప్రజలు కూడా నివసిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. అయితే మున్సిపల్ ఇళ్లు కూల్చివేయడంతో వర్షాకాలం రాకముందే పలు కుటుంబాలు చిన్న పిల్లలతో సహా రోడ్డు పక్కన తాత్కాలిక టెంట్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరు ఇంజనీర్ల(engineer)ను పిలిచి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ఇళ్లను ఎందుకు కూల్చివేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కూల్చివేసేందుకు ఇంజనీర్లకు ప్రభుత్వ మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పాలని ఎమ్మెల్యే నిలదీశారు. ఆ క్రమంలో ఇద్దరు ఇంజనీర్లు ముఖం దించుకుని నిలబడి ఉన్నారు. ఆ క్రమంలో మహిళా ఎమ్మెల్యే ఓ ఇంజనీర్ వద్దకు వెళ్లి చంపపై కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(viral) గా మారింది. ఈ విషయంపై పురపాలక సంఘం బాధ్యులు మాత్రం పెదవి విప్పడం లేదు. ఎమ్మెల్యేను కూడా ఫోన్లో సంప్రదించలేకపోయారు. మీరా భైందర్ అసెంబ్లీ ఎమ్మెల్యే గీత గతంలో బీజేపీ మేయర్గా పనిచేశారు. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR