ASR: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొయ్యూరు సీఐ బీ. శ్రీనివాసరావు శనివారం హెచ్చరించారు. సుఖ సంతోషాలతో పండుగ నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. పండుగ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. కోడిపందాలు జరిపితే, నిర్వాహకులు, పందెగాళ్లు, స్థలం యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు.