అన్నమయ్య: రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమం చేపట్టాలని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు టి. ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం రాయచోటిలోని అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద జేఏసీ సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు JACలో భాగస్వాములై ప్రత్యేక జిల్లా సాధించాలన్నారు.