WGL: పట్టణ కేంద్రంలో ఇవాళ MLA నాయిని రాజేందర్ రెడ్డిని శ్రీ భద్రకాళి ఆలయ చైర్మన్ శివ సుబ్రమణ్యం, ఈవో సునీత మర్యాదపూర్వకంగా కలిసి.. సన్మానించారు. ఈ సందర్భంగా MLA నాయిని మాట్లాడుతూ.. దసరా నవరాత్రి ఉత్సవాలకు ముందే భద్రకాళి అమ్మవారి దివ్యకళ, శిల్ప సంప్రదాయాలకు తగినట్లుగా అన్ని హంగులతో పెద్ద రథం నిర్మించాలని MLA సూచించారు. ఆలయ సభ్యులు తదితరులు ఉన్నారు.