కోనసీమ: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగ్గన్న తోట, కొత్తపేట ప్రభల తీర్థం బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ రాహుల్ మీనా శనివారం పర్యవేక్షించారు. ఆయన ఉత్సవ ప్రదేశాలను సందర్శించి, అక్కడ చేపట్టవలసిన భద్రతా చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్థాలకు లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.