KNR: సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తులు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి కోరారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై నిఘా ఉంటుందని అన్నారు.