KNR: తనపై నమ్మకంతో పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్ష పదవిని అప్పగించిన అధిష్ఠానానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్లో జరిగిన సన్మాన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల సంక్షేమమే లక్ష్యంగా, వారిని కాంగ్రెస్ వైపు నడిపించే బాధ్యతగా ఈ పదవిని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.