GNTR: యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (RSETI) కొత్తపేట–గుంటూరులో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు, మహిళల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ టీ. సందీప్ బాబు తెలిపారు. దీనిలో భాగంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, రిఫ్రిజరేషన్ & ఏసీ సర్వీసింగ్ కోర్సులు నిర్వహిస్తారు. శిక్షణ కార్యక్రమంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి అందిస్తారు.