విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో నూతన పార్లమెంట్ కమిటీ కార్యవర్గ సమావేశం అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణల ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ నెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.