MDK: రేగోడ్ మండల పరిధిలో నిషేధిత చైనా మాంజా విక్రయాలు పూర్తిగా నిషేధమని ఎస్సై పోచయ్య స్పష్టం చేశారు. రేగోడ్ మండల కేంద్రంలోని శనివారం కిరాణా షాపులు, గాలిపటాల విక్రయ కేంద్రాలను సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి చైనా మాంజా అమ్మినా, వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.