NZB: వారం రోజుల్లో 232 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈనెల 5 నుంచి 9 వరకు వాహన తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. వీరికి న్యాయస్థానం రూ.22,40,000 జరిమానా విధించినట్లు తెలిపారు. ఇందులో ఆరుగురికి వారంరోజుల పాటు జైలు శిక్ష విధించారని సీపీ వివరించారు.