SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్వామివారి నిత్య అన్నదాన సత్రాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారి రమాదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నదాన సత్రానికి వచ్చే భక్తులకు అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రతపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు.