MDK: కౌడిపల్లి మండలంలోని ప్రసిద్ధ తునికి నల్ల పోచమ్మ అమ్మవారి హుండీ ఆదాయం రూ.5,45,476 వచ్చినట్లు ఆలయ ఈవో రంగారావు తెలిపారు. శుక్రవారం పోలీసులు, శ్రీ శివ కేశవ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు, భక్తుల సమక్షంలో హుండీలను లెక్కించారు. ఈ ఆదాయం నాలుగు నెలల 20 రోజులకు సంబంధించినదని అధికారులు వెల్లడించారు.