జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ టైటిల్‌కు మరింత చేరువయ్యింది. మహిళల 48-51 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ 5-0తో లాల్చెన్బీ చాను తొంగ్రామ్పై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఆమె సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు హితేశ్ గులియా కూడా సెమీస్ పోరుకు అర్హత సాధించింది.