Fruits For Digestion:అజీర్తితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 5 పండ్లను తినండి
కొంతమందికి బయట ఆహారం తిన్న తర్వాత కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ కడుపుని జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీనిని నివారించేందుకు మీ రోజువారి ఆహారంలో ఈ 5 పండ్లు తీసుకుంటే మీ కడుపు స్థితిని మెరుగుపడుతుంది.
These Foods Are Should Not Be Eaten On Empty Stomach
Fruits For Digestion:దిగజారుతున్న జీవనశైలి(life style), ఆహారపు అలవాట్ల(food habbits) కారణంగా ప్రజలు కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమందికి బయట ఆహారం తిన్న తర్వాత కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ కడుపుని జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీనిని నివారించేందుకు మీ రోజువారి ఆహారంలో ఈ 5 పండ్లు తీసుకుంటే మీ కడుపు స్థితిని మెరుగుపడుతుంది.
జీర్ణక్రియకు ఏ పండు మంచిది? నేరేడు పండు
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆప్రికాట్లను మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. నేరేడు పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో ఈ పండు కడుపుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మామిడి పండు
వేసవి కాలం అనగానే టక్కున గుర్తుకు వచ్చేది మామిడిపండు. ఇది కడుపు సమస్యల నివారణకు ప్రయోజనకరంగా ఉంటుంది. మామిడి పండ్లను తీసుకోవడం వల్ల మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇందులో పొట్టకు మేలు చేసే అనేక ఆరోగ్యకరమైన ఎంజైములు ఉన్నాయి.
కివి
మీ ఆహారంలో ఆక్టినిడిన్ ఎంజైమ్ అధికంగా ఉండే కివీని చేర్చండి. ఈ ఎంజైమ్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు పోవాలంటే ప్రతిరోజూ ఒక కివి తినాలి.
ఆపిల్
ప్రతి వైద్యుడు తినమని చెప్పే పండు యాపిల్. ఆపిల్ నుండి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ పండు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. మీరు మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలతో పోరాడుతున్నట్లయితే ఆపిల్ తినడం ప్రారంభించండి.
బొప్పాయి
బొప్పాయిలో పపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఖాళీ కడుపుతో దీనిని తినడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ వేగవంతం చేయడంతో పాటు పేగులకు మేలు చేస్తుంది.