Hara Gopal: ఉపా (upa-అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ (Hara Gopal) తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన ఒక్కరిపై కాదు.. అందరీపై తీసేయాలని.. మొత్తం 152 మందిపై కేసు ఎత్తేయాలని కోరారు. ఉపా రద్దు కోసం అన్నీ పార్టీలను కలుస్తామని పేర్కొన్నారు. తనపై నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకోవడానికి గల కారణం తప్పుడు కేసే కదా..? మరీ మిగతా వారి పరిస్థితి ఏంటీ అని అడిగారు. ఉపా అమలు చేయమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల ప్రొఫెసర్ హరగోపాల్‌పై (Hara Gopal) ఉపా చట్టం నమోదు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు వెనక్కి తీసుకున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడారు. హరగోపాల్ మీద కేసు పెట్టడం గురించి ప్రస్తావించారు. అతనిపై కేసు ఎవరు పెట్టారో గుర్తించాలని కోరారు. సదరు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదీ పోలీసుల రాజ్యం కాదు.. ప్రజారాజ్యం అని మల్లు రవి కామెంట్స్ చేశారు. ఉపా చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నమోదు చేస్తారని గుర్తుచేశారు.
ఉగ్రవాదులు, దేశద్రోహులు, దేశ రహస్యాలు బహిర్గతం చేసేవారిపై ఉపా చట్టం ప్రయోగిస్తారు. సామాన్యులపై.. ప్రశ్నించేవారిపై, న్యాయం కోసం పోరాటం చేసేవారిపై ఉపా చట్టం ప్రయోగిస్తున్నారు. దీనిని మేధావులు ఖండిస్తున్నారు. మేధావి అయిన హరగోపాల్‌పై (Hara Gopal) ఉపా కింద కేసు ఫైల్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వెనక్కి తీసుకున్నారు.