NLR: మనుబోలు మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. YSR కూడలి వద్ద పెంచలయ్యకు చెందిన బట్టల గోడౌన్ గ్రిల్స్ తొలగించి రూ.లక్ష విలువైన వస్తువులను, బీసీ కాలనీలోని మరో ఇంట్లో తలుపులు పగులగొట్టి రూ. 50 వేల నగదు, 5 ఉంగరాలు, వెండి వస్తువులను అపహరించారు. క్లూస్ టీంతో పోలీసులు వేలిముద్రలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.