కృష్ణా: సంక్రాంతి సందర్భంగా గుడ్లవల్లేరు మండల పరిధిలో కోడి పందేలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎంపీడీవో ఇమ్రాన్ నిన్న తెలిపారు. కోడి పందేలు నిర్వహించిన వారిపైనా, వాటిలో పాల్గొన్న వారిపైనా చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు.