ASR: ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి కొత్త అంబులెన్స్ కేటాయించాలని, అరకు ఆసుపత్రి అంబులెన్స్‌కు డ్రైవర్‌ను నియమించాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఐటీడీఏ పీవోను కోరారు. దీనిపై పీవో పూజ సానుకూలంగా స్పందించి, త్వరలోనే అంబులెన్స్, డ్రైవర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గురుకుల విద్యార్థుల వసతి సమస్యలపైనా ఈ భేటీలో చర్చించారు.