కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల వేళ టికెట్ల లొల్లి మొదలైంది. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీలో పోటీ తీవ్రమైంది. ఏళ్ల తరబడి జెండా మోసిన సీనియర్లు ఒకవైపు, కొత్తగా చేరిన మాజీ కార్పొరేటర్లు మరోవైపు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. కొన్ని డివిజన్లలో ముగ్గురు, నలుగురు పోటీపడుతున్నట్లు సమాచారం.