W.G: తిరుమలలో మద్యం, మాంసాలు, అన్యమత ప్రచారం జరుగుతున్నా టీటీడీ పాలక మండలి, సీఎం చంద్రబాబుకు గాని పట్టడం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఆదివారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దీన్ని బట్టి చంద్రబాబుకు దేవుని పట్ల ఎంత భక్తి, విశ్వాసం ఉన్నాయనేది అర్థం అవుతుందన్నారు.