MDCL: నగరంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. జలమండలి తెలిపిన వివరాల ప్రకారం, గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలో పైపులైన్ లీకేజీ ఏర్పడింది. దీనివల్ల సూరారం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ మరియు పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.