SRPT: భౌగోళిక పరిస్థితులను బట్టి సూర్యాపేట మండలంలోని తాటిపాముల గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో అత్యధికంగా తాటిచెట్లు ఉంటాయి. అదే విధంగా ఆ చెట్ల పరిసరాలల్లో పాములు ఎక్కువగా సంచరించేవని పూర్వీకులు చెప్పేవారు. తాటి వనం, పాముల సంచారం కలిగిన ప్రాంతం కావడంతో తాటిపాముల అనే పేరు వచ్చిందని స్థానికులు అంటున్నారు.