SRPT: మఠంపల్లి మండలంలోని భీల్యానాయక్ండాలో ఆదివారం రాత్రి మఠంపల్లి పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జూదం స్థావరాలపై దాడులు నిర్వహించారు. భీల్యానాయక్ండాలో జూదం ఆడుతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని, రూ.24,600 నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాబు తెలిపారు.