JGL: కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన వేముల చొక్కయ్య (55) అనే వ్యక్తి దుబాయ్ దేశంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు అక్కడివారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చొక్కయ్య 10 ఏళ్లుగా ఉపాధి నిమిత్తం దుబాయ్ దేశం వెళ్లి వస్తున్నారు. తాను ఉంటున్న గదిలో మృతి చెందినట్లు స్నేహితులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు.