VZM: ఎస్ కోటలో ఎస్టీ గిరిజన సంక్షేమ భవనం నిర్మించాలని కోరుతూ ఆదివారం ఎల్ కోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. భవన నిర్మాణం కోసం సంబంధిత అధికారులతో చర్చించి భవన నిర్మాణానికి చర్యలు చేపడతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్టి సెల్ అధ్యక్షురాలు బోనంగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.