గోదావరి జలాలపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. పోలవరం, నల్లమలసాగర్, బనకచర్ల ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. 8 మందిని ప్రతివాదులుగా చేర్చింది. తెలంగాణ పిటిషన్ను కొట్టివేయాలంటూ ఏపీ కౌంటర్ దాఖలు చేసింది. రాజకీయ కారణాలతో కేసు వేశారని ఆరోపిస్తుంది. CJI ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ముంబైలో సీనియర్ లాయర్ సింఘ్వీతో రేవంత్, ఉత్తమ్ చర్చలు జరుపుతున్నారు.