ASR: జీ.మాడుగుల మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ ఉర్లమెట్ట అటవీ ప్రాంతంలో ఎంతో విలువైన సిరి గంధం చెట్లను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసి పారిపోయారని బాధితులు తెలిపారు. ఉర్లమెట్టకు ఆనుకొని ఉన్న కొండపై విలువైన గంధం చెట్లను కొట్టుకుని పోయినట్లు వారు పేర్కొన్నారు. వెంటనే ఫారెస్టు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.