AP: రాష్ట్రంలో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. విజయనగరంలో 15 డిగ్రీలు, అనంతపురంలో 16.5, కడప 17, శ్రీకాకుళం, విశాఖలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.