JGL: ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామ శివారులోని సదర్మట్ ప్రాజెక్టు వద్ద 5 గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. సదర్మట్ నుంచి గంగనాల ప్రాజెక్టుకు నీరు విడుదల కావడం లేదని, దీంతో దిగువ ప్రాంతాల్లో పంటల సాగు పూర్తిగా దెబ్బతిన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా నీరు లేక పంటలు ఎండిపోయాయని తెలిపారు. వెంటనే నీరు విడుదల చేసి ఆదుకోవాలన్నారు.