KNR: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని రీజినల్ మేనేజర్ రాజు అన్నారు. మేడారం జాతర సందర్భంగా మెట్పల్లి ఆర్టీసీ డిపో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సేవా భావంతో పనిచేయాలని, జాతరకు సంబంధించిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జాతర విధులలో పాల్గొనే సిబ్బందికి కావలసిన ఏర్పాట్లు, సౌకర్యాలు గురించి వివరించారు.