GNTR: రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం ఐనవోలులో శనివారం రాత్రి మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీఏ (CRDA) చర్యలు చేపట్టిందని వివరించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ సభ నిర్వహించినట్లు పేర్కొన్నారు.