TG: TTD నిధులతో కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగడంపై BRS నేత దాసోజు శ్రవణ్ హర్షం వ్యక్తం చేశారు. 2009లో హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి అంజన్న ఆశీస్సులతో ప్రస్తుత AP Dy.CM పవన్ బయటపడ్డారని పేర్కొన్నారు. ఇక ఆలయంలో దిక్షా విరమణ మండపం, సత్రం నిర్మించటం సంతోషదాయకమన్న శ్రవణ్.. ఇందుకు రాష్ట్ర ప్రజల తరఫున పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు.