కృష్ణా: సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని గుడ్లవల్లేరు గ్రామంలో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్సై సత్యనారాయణ ప్రజలకు శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ ‘క్రీడలు ముద్దు – జూద క్రీడలు వద్దు’ అనే నినాదంతో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, జూదం జరగే అవకాశం ఉన్న నిషిద్ధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.