ప్రధాని మోదీ (Pm modi)పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న రాహుల్‌గాంధీ(Rahul Gandhi) కి స్వల్ప ఉరట లభించింది.కోర్టు హాజరు నుండి మినహాయింపును ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బాంబే హైకోర్టు (Mumbai High Court) పొడిగించింది. ఆగస్ట్(August)2 వరకు ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపును ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ(BJP)కి చెందిన మహేశ్(Mahesh) 2021లో పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారణకు రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ గతంలో స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ రాహుల్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్వీ కొత్వాల్ (SV Kotwal) నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా హాజరు మినహాయింపును న్యాయస్థానం మరోసారి పొడిగించింది.