AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. SVS కెమికల్స్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో కార్మికులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు.