తమిళ రాజకీయాల్లో సంచలనం జరగబోతోంది. కాంగ్రెస్తో పొత్తుపై టీవీకే సంకేతాలు ఇచ్చింది. టీవీకే అధినేత విజయ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మిత్రులేనని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సంకేతాలపై పలువురు విమర్శిస్తున్నారు. డీఎంకేను గద్దే దింపటమే తమ లక్ష్యమని చెప్పిన విజయ్.. ఇప్పుడు ఆ పార్టీ కూటమిలో భాగమైన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటానికి ప్రయత్నించటం ఏమిటని మండిపడుతున్నారు.